భూకబ్జాదారులు ఏ పార్టీకి చెందిన వారైనా వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని బద్వేల్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి హెచ్చరించారు. బద్వేల్ ప్రాంతంలో ఓ ముఠా ఫోర్జరీ పత్రాలతో భూకబ్జాలకు పాల్పడుతోందని, పోలీసులదృష్టికి వెళ్లడంతో వారు తగు విచారణ చేపట్టారని తెలిపారు. నియోజకవర్గంలోని కబ్జాలపై గత ప్రభుత్వ హయాం నుంచి కూడా తాను పోరాటం చేస్తున్నానని వెల్లడించారు. కబ్జాదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.