అట్లూరు మండలం చిన్న రాజు పల్లి గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు అంజిరెడ్డి తన వ్యవసాయ భూమిలో ట్రాక్టర్తో దుక్కి దున్నుతుండగా, అకస్మాత్తుగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో అంజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న అంజిరెడ్డి మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.