గోపవరం మండలం బుచ్చనపల్లిలో శనివారం బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి కరపత్రాలను పంచుతూ ప్రజలకు వివరించారు. వారి సమస్యలను తెలుసుకొని అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కరించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.