బద్వేల్: 'మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు'

పోరుమామిళ్ల మండలం ఎస్. వెంకటాపురంలో మాజీ పిఆర్ & ఆర్ డి ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చెప్పిన మోసపూరిత హామీలను ఇచ్చిందని ప్రచారం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో చెప్పిన పథకాలు అన్ని సక్రమంగా ఇచ్చారని ఆయన అన్నారు. అసాధ్యమైన సూపర్ సిక్స్ హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో సరైన తీర్పునిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్