బద్వేల్ పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలో 2014-19 మధ్య ఉపాధి హామీ పథకం కింద వేసిన సీసీ రోడ్ల పెండింగ్ బిల్లుల వివరాలను అందించాలని బద్వేల్ టీడీపీ ఇంఛార్జ్ రితీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఈనెల 5వ తేదీలోపు బద్వేల్ పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో వివరాలు అందిస్తే, తదుపరి బిల్లుల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.