బద్వేలులో రోగి బంధువులపై ప్రైవేట్ వైద్యుడు దాడి చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మొదట హెల్త్ కార్డ్ ద్వారా ఉచితంగా వైద్యం చేస్తానని వైద్యుడు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కు రూ.16 వేలు డబ్బులు చెల్లించాలని వైద్యుడు అడిగాడని, ఉచిత ఆపరేషన్ అని చెప్పి డబ్బు అడుగటంపై రోగి బంధువులు ప్రశ్నించారు. ఈ క్రమంలో నన్నే ప్రశ్నిస్తారా అంటూ రోగి బంధువులపై వైద్యుడు దాడి చేయించినట్లు సమాచారం