బద్వేల్: పశు బీమా పథకాన్ని వినియోగించుకోవాలి

పోరుమామిళ్ల పశుసంవర్ధక శాఖ ఏడీఏ డాక్టర్ చంద్రశేఖర్, కాశినాయన మండలం గంగనపల్లె గ్రామంలో శుక్రవారం జరిగిన పశు ఆరోగ్య శిబిరంలో మాట్లాడుతూ, పశు బీమా పథకాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏదైనా కారణంతో పశువులు, జీవాలు మరణిస్తే బీమా వస్తుందని తెలిపారు. శిబిరంలో పశువులకు గర్భ నిర్ధారణ పరీక్షలు, గర్భకోశ చికిత్సలు అందించడంతో పాటు 282 దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తాపించారు.

సంబంధిత పోస్ట్