బద్వేల్: వ్యవసాయ అధికారిని కలిసిన మార్కెట్ యార్డు చైర్మన్

వ్యవసాయ ఉప మార్కెటింగ్ సంచాలకులు లావణ్యను బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ గురువారం కలిశారు. పోరుమామిళ్లలో ఉన్న ఉప మార్కెట్ యార్డ్ ను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆమె కోరారు. దీనికి లావణ్య సానుకూలంగా స్పందించి, త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పోరుమామిళ్ల కేంద్రంగా రైతు బజార్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సుప్రజ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్