బద్వేల్: అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి

బద్వేల్ నియోజకవర్గంలో డబ్బుల విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం ఘోరంగా మారింది. ఆదివారం గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద జరిగిన ఈ ఘటనలో, చిన్న గురవయ్య అనే వ్యక్తి మృతి చెందగా, పెద్ద గురవయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని బద్వేల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన కలసపాడు మండలం రామాపురం గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ముల మధ్య జరిగింది.

సంబంధిత పోస్ట్