బద్వేల్: పెన్షన్ పంపిణీలో వాలంటీర్ తో సర్పంచ్ వాగ్వాదం

కాశినాయన మండలం నరసాపురంలో శుక్రవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్ తో కలిసి పంపిణీ చేయడంతో సర్పంచ్ ఖాజావలి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజాప్రతినిధులను కూడ పరామర్శించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే తనకు ముందుగా సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్