ప్రైవేట్ స్కూల్ వాహనాల్లో విద్యార్థులను అధికంగా తరలిస్తున్న కారణంగా ప్రమాదాలకు గురయ్యే అవకాశముందని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. బద్వేల్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ కు గురువారం వినతిపత్రం అందజేస్తూ, ఇలాంటి విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.