కడప జిల్లా బద్వేల్‌లో ఆదివారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అక్కడ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలపై భారం మోపే విధంగా తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు.