శనివారం బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద పట్టపగలు చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఒక మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. ఈ చోరీ సమయంలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుల కోసం గాలిస్తున్నారు.