చాపాడు: పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో శుక్రవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దూడలు, మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు అందించారు. పశువులకు గర్భకోశ వ్యాధులు, సాధారణ చికిత్సలు చేశారు. పశువైద్య సిబ్బంది మణి, ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ఉచిత శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ పశు బీమాను ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్