బద్వేల్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా జరిగింది. కార్మికుల హక్కులకు హానికలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ ఉద్యమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం సమర్పించారు.