హనీ ట్రాప్‌ కేసులో కొత్త ట్విస్ట్

బద్వేల్‌కు చెందిన అశోక్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన అమ్మాయిల ద్వారా హనీ ట్రాప్‌కు గురై రూ.81 లక్షలు కోల్పోయాడు. మొదట కష్టాలు చెప్పిన ఒక అమ్మాయికి డబ్బులు పంపించగా, ఆ తర్వాత చంద్రకళ అనే మరో అమ్మాయి పరిచయమైంది. వీరిద్దరితో కలిపి మొత్తం రూ.81 లక్షలు అశోక్ పంపించాడు. డబ్బులు తిరిగివ్వమని అడిగితే చనిపోతానని బెదిరించారని అర్బన్ సీఐ రామకృష్ణ తెలిపారు. వీరి అకౌంట్ల నుంచి రామలింగారెడ్డి అనే బంధువుకు డబ్బులు వెళ్లినట్లు సీఐ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్