సిద్ధవటం హైలెవెల్ వంతెనపై అతివేగంగా వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో కోటయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలు విరిగి, తలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని సిద్ధవటం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.