డ్రైవింగ్ వృత్తిలో నిబద్ధతతో సేవలందించిన మార్కాపురం సుందరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషాద సమయంలో పోరుమామిళ్ల S.K.V ట్రావెల్స్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో, పలువురు ట్రావెల్స్ డ్రైవర్లు, ఓనర్లు కలిసి సుందరం కుటుంబాన్ని పరామర్శించి, వారికి రూ. 5000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శివ, విష్ణు, విజయ్, ఓబయ్య, అలీ, మస్తాన్ వంటి ట్రావెల్స్ డ్రైవర్లు పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తపరిచారు.