పెద్దముడియం మండలం ఉప్పలూరు గ్రామం 70 ఏళ్లుగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్నికల వరకు రాజకీయాలు, ఆ తర్వాత అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తారు. చిన్న వివాదాలు వచ్చినా కోర్టులు, పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా గ్రామ పెద్దల సమక్షంలో సామరస్యంగా పరిష్కరించుకుంటారు.