జమ్మలమడుగు వ్యవసాయ మార్కెట్ కమిటీకి పాలకవర్గం నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎంసి గౌరవ ఛైర్మన్గా స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని నియమించారు. ఛైర్మన్ సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి, వైస్ ఛైర్మన్ గా తుమ్మలూరు మల్లికార్జునను నియమించారు. మొత్తం 20 మందితో కమిటీని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.