మోరగుడిలోని ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

జమ్మలమడుగు-తాడపత్రి ప్రధాన రహదారిలోని మోరగుడి గ్రామం వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకువచ్చిన కారు అదుపుతప్పి ఓ ఇంటిలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ఉన్న వ్యక్తికి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంతో ఇంటికి స్వల్ప నష్టం వాటిల్లింది.

సంబంధిత పోస్ట్