పశుగ్రాస సాగుతో పాడి రైతులకు ప్రయోజనం కలుగుతుందని పశుసంవర్ధక శాఖ జేడి శారదమ్మ అన్నారు. చాపాడు మండలం బర్రిపల్లెలో శుక్రవారం జరిగిన పశుగ్రాస పక్షోత్సవాల్లో ఆమె మాట్లాడారు. పశువుల కోసం పశుగ్రాసం సాగిస్తే కొరత తీరుతుందన్నారు. దీంతో పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని తెలిపారు.