ఇడమడక గ్రామంలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డికి చెందిన డాబాను అధికారులు కూల్చివేసారు. ఈ డాబాను బుధవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పరిశీలించారు. ఇది టీడీపీ కక్షసాధింపు చర్య అని వారు విమర్శించారు. వైసీపీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.