జమ్మలమడుగు నియోజకవర్గంలోని గూడెం చెరువులో ఆగస్టు 1న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ ఇన్‌చార్జ్ భూపేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. ఆ రోజు చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేసి, లబ్ధిదారులతో ముఖాముఖి చర్చ నిర్వహించనున్నట్లు భూపేశ్ రెడ్డి తెలిపారు.