కడప జిల్లా జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు ఆటోలో ప్రయాణించారు. సాధారణ ప్రజలతో మమేకమవుతూ ఆటో డ్రైవర్‌ల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఆటోలో ప్రయాణిస్తూ వారికి ఎదురయ్యే ఇబ్బందులు, డీజిల్ ధరలు, ఆదాయం వంటి అంశాలపై చర్చించారు. ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలను తెలుసుకోవడమే తన పాలన విధానమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.