ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. "స్త్రీ శక్తి" పేరిట ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు శుక్రవారం తెలిపారు. ఇది ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు, వారి స్వేచ్ఛ, భద్రతకు తోడ్పడేలా రూపొందించామని సీఎం వెల్లడించారు. ప్రయాణ సందర్భాల్లో మహిళలకు తగిన గుర్తింపు కార్డు ఉంటే RTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు.