జమ్మలమడుగు మండలంలో రేపు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. మండలంలోని గూడెం చెరువు, గండికోట ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా. దాదాపు 2వేల మంది పోలీసుల బందోబస్తు ఉంటారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అనంతరం సభా ప్రాంగణం, హెలిపాడ్ వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి సూచనలు ఇచ్చారు. పార్కింగ్ స్థలాల ఏర్పాట్ల గురించి డీఎస్పీ వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు.