జమ్మలమడుగు పరిధిలో పెన్నా నదిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. సీఎం సభ ఏర్పాట్ల కోసం కడప నుంచి వచ్చిన గోపాల్, మున్నా అనే ఇద్దరు యువకులు నదిలో దిగి గల్లంతయ్యారు. గోపాల్ మృతదేహాన్ని వెలికితీయగా, మున్నా కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ప్రమాదకర ప్రాంతమని హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ వారు పట్టించుకోలేదు.