కడప: నేతన్నలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీఎం చంద్రబాబు ఆమోదంతో ఉచిత విద్యుత్ పథకాన్ని నేటి (శుక్రవారం) నుంచే అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద మామూలు మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వనున్నారు. ఈ పథకానికి రూ.125 కోట్ల వరకు ఖర్చు కానుంది. రాష్ట్రంలో 50 వేల మగ్గాలు, 15 వేల మర మగ్గాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్