గండ్లూరు గ్రామంలో సీఐ మహమ్మద్ రఫీ, ఎస్సై ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు కానిస్టేబుల్ బి. రవికుమార్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని శనివారం రాత్రి చేపట్టారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. బాల్యవివాహాలు, ఫేక్ లోన్, శక్తి యాప్, ఆన్లైన్ బెట్టింగ్, వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.