కొండాపురం: రెండు లారీలు ఢీ.. తప్పిన ప్రమాదం

గురువారం జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం చౌటిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ రిపేర్ కోసం రోడ్డు పక్కన ఆగగా, వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఓబులనాయుడు లారీలోనే ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న సీఐ రాజా, ఏఎస్ఐ హాజీ భాషా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని రక్షించి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్