గురువారం జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురంలోని పాత కొండాపురం సమీపంలో చిత్రావతి నది వంతెన వద్ద రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం, రైలు ఢీకొనడంతో మృతుడి తల, మొండెం వేరుపడ్డాయి. మృతుడు పసుపు రంగు చొక్కా, నీలం రంగు పాయింట్ ధరించి ఉన్నాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.