ముద్దనూరు: ఇంటి గేటు మీద పడి చిన్నారి మృతి

ముద్దనూరు మండలం నల్లబల్లెలో బుధవారం విషాదం నెలకొంది. ఇంటి గేటు మీద పడి అనుశ్రీ మృతి చెందింది. తొండూరు మండలం ఊడగండ్లకు చెందిన రవికుమార్, గాయత్రిల కుమార్తె అనుశ్రీ. గాయత్రి రెండో కాన్పు కోసం అమ్మగారి ఊరైన నల్లబల్లెకు అనుశ్రీతో కలిసి వెళ్లింది. అక్కడ ప్రమాదవశాత్తు చిన్నారిపై గేటు మీద పడటంతో తలకు తీవ్రగాయమైంది. వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు.

సంబంధిత పోస్ట్