ముద్దనూరు: వివాహిత మిస్సింగ్ కేసు నమోదు

ముద్దనూరు మండలంలోని ఆకుతోటపల్లె గ్రామానికి చెందిన 32 సంవత్సరాల దేనేపల్లె అంకాలమ్మ ఈ నెల 9వ తేదీ నుండి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాలు మరియు బంధువులు ఆరా తీయగా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె అన్న నల్లబల్లె వీరాంజనేయులు ఫిర్యాదు మేరకు సోమవారం నాడు సిఐ దస్తగిరి కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 91211 00614 సీఐ నంబర్కు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్