రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

జమ్మలమడుగు –ముద్దునూరు రహదారిలోని టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రికి చెందిన ఓ కుటుంబం గండికోట సందర్శించి తిరిగి వెళ్తుండగా, ముద్దనూరు వైపు నుంచి వస్తున్న కంకర టిప్పర్ కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్ వెంకటరమణ (24) అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ సభ్యులు గాయపడటంతో వారిని వెంటనే జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్