జమ్మలమడుగు మండలంలో సున్నపురాళ్లపల్లె వద్ద JSW సంస్థకు 2 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ కోసం 1100 ఎకరాలు, టౌన్‌షిప్ కోసం 200 ఎకరాలు కేటాయించారు. అదే ప్రాంతంలో 400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కోసం 2400 ఎకరాలు మంజూరు చేశారు. దిగువ పట్టణం వద్ద ఒబెరాయ్ రిసార్ట్‌కు 50 ఎకరాలు, బొమ్మేపల్లె (కొండాపురం)లో ఆదాని పవర్ ప్లాంట్‌కు 191.64 ఎకరాలు ఇచ్చారు. సెయిల్ సంస్థకు 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూములు కేటాయించారు.