పెద్దముడియం మండలం గుండ్లకుంటలో సోమవారం సాయంత్రం ట్రాక్టర్ పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి విశ్రాంత ప్రధానోధ్యాయుడు పొన్నపురెడ్డి నరసింహారెడ్డి (75) మృతిచెందారు. మేడిదిన్నెకు చెందిన అతను గుండ్లకుంటలో నివాసం ఉంటున్నారు. తన ఇంటి సమీపంలో ఉన్న మట్టి, రాళ్లను పొలం గట్లకు తరలించేందుకు ట్రాక్టర్లో తీసుకెళ్లారు. అక్కడ ట్రాక్టర్ దిగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందారు. కాగా ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.