జమ్మలమడుగు-ముద్దునూరు రహదారిలోని పాటి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పెద్ద దండ్లూరు వాసి మాబు హుస్సేన్ (36), ప్రొద్దుటూరు మండలం చౌడూరు వాసి ఖాదర్ బాషా (32) బైక్పై ముద్దనూరు నుంచి జమ్మలమడుగుకు వస్తుండగా, అడ్డు వచ్చిన ఆవును తప్పించబోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న వరి కోత మెషీన్ వాహనాన్ని ఢీకొని మరణించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.