సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లనే నినాదంతో టీడీపీ ఏర్పాటైందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీఎం సురేశ్ నాయుడు తెలిపారు. టీడీపీ 44వ వసంతంలోకి అడుగుపెట్టడం సంతోషదాయకమని ఆయన అన్నారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.