కడప జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆధునిక సాంకేతికతతో తయారైన బైకులను ప్రారంభించారు. సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రెసింగ్, క్రౌడ్ కంట్రోల్ సదుపాయాలు ఉన్న ఈ బైకుల్లో కడపకు 7, ప్రొద్దుటూరుకు 4, పులివెందులకు 2, మిగిలిన ప్రాంతాలకు ఒక్కొక్కటిగా కేటాయించారు.