బద్వేల్ పట్టణంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) ఆధ్వర్యంలో విద్యార్థుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో AISA రాష్ట్ర ఇంచార్జి వేమన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన NEP–2020 విద్యను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టే విధానమని విమర్శించారు. VBSA బిల్లుతో యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని హరించి, ప్రజాస్వామ్య విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కేంద్రం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. UGC, NCTE, AICTE వంటి సంస్థలను నిర్వీర్యం చేసి, విద్యా వ్యవస్థను కేంద్రం చేతిలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. విద్యను హక్కుగా కాకుండా వ్యాపారంగా మార్చే విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.