తిరుపతి సీతమ్మనగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రసూల్ శనివారం సాయంత్రం SVU పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండగా కారులో బలవంతంగా కిడ్నాప్ అయ్యారు. కడపకు చెందిన మనోహర్ రెడ్డి, ఖాజాపీర్, సుబ్బారెడ్డి, శివకుమార్ లు ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు వ్యాపారి డ్రైవర్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఎర్రచందనం చెట్లు ఉన్న వెంచర్ కొనుగోలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వారికీ ఈయన తరపున లాయర్ నోటీసులు పంపారు. శనివారం సాయంత్రం వీరు కిడ్నప్ చేయగా అయన కారు డ్రైవర్ కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఆచూకీ కోసం రంగంలోకి దిగారు.