కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, అనారోగ్యంతో మునిస్వామి అనే 80 ఏళ్ల వృద్ధుడు మరణించారు. ఆయనకు ఒక పెళ్లి కాని కూతురు మాత్రమే ఉంది. బంధువులు లేక, ఆర్థికంగా ఇబ్బందులతో అంత్యక్రియలు చేయలేని ఆయన కూతురు ఉంది. విషయం తెలుసుకున్న "మేము సైతం" సేవా సంస్థ, చిన్నచౌక్ ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మోచంపేట స్మశానంలో హిందూ సంప్రదాయం ప్రకారం గురువారం అంత్యక్రియలు నిర్వహించారు