కడప: వసతి గృహాన్ని పరిశీలించిన న్యాయమూర్తి

కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి ఎస్ బాబా ఫక్రుద్దీన్ గురువారం కడప నగరంలోని బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. వసతి గృహములోని విద్యార్థులకు అందుతున్న వసతులను సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తెలపాలని సూచించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100, చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, దివ్యాంగజన్ హెల్ప్ లైన్ నెంబర్ 14456 లపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్