కడపలో చెత్త పన్ను పేరుతో వసూలైన నిధులను మింగిన వైసీపీ పెద్దలు అధికారుల నుంచి కక్కిస్తామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు. గురువారం కడపలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో మొదలైన చెత్త పన్ను 2022 మార్చిలో టార్గెట్ నుంచి 79 శాతం వసూలు అయ్యాయి. 2023 వచ్చేసరికి అవి 30 శాతానికి పడిపోయాయని చెప్పారు. ఇలా తగ్గుతూ చూపించిన వసూళ్లు ఎవరు తిన్నారో సమాధానం చెప్పాలన్నారు.