కడప ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ ఆర్. శ్రీనివాస రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.