రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ బోగీలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు గళ్ళ లుంగీ, సిమెంట్ కలర్ చొక్కాపై నలుపు–తెలుపు గళ్లతో ఉన్న ఫుల్ షర్ట్ ధరించి ఉన్నట్లు కడప రైల్వే పోలీసులు తెలిపారు. పొట్టపై ఆపరేషన్‌కు సంబంధించిన పాత గాయం, చెవులకు సునితి చేసిన గుర్తులు ఉన్నాయి. గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి మృతుడి వివరాలు గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్