చెన్నూరులో ఒకరు మిస్సింగ్

చెన్నూరు మండలం రుద్రభారతి పేటకు చెందిన దుర్గం దస్తగిరి (37) నాలుగు రోజుల క్రితం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు. బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. దస్తగిరిని ఎవరైనా ఎక్కడైనా చూసినట్లయితే లేదా సమాచారం తెలిసినట్లయితే వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్