చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ శనివారం పుష్పగిరి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గాలి గోపురంపై అరుదైన 'స్థానక' (నిలుచున్న) విశ్వక్సేనుని కుడ్య శిల్పాన్ని గుర్తించినట్లు తెలిపారు. సాధారణంగా కూర్చుని ఉండే విశ్వక్సేనుడు ఇక్కడ నిలబడి ఉండటం రక్షణకు, అప్రమత్తతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కిరీటం, ఆభరణాలు, శంఖుచక్రాలతో ఈ శిల్పం విశేషంగా, దైవత్వంతో ఉందని తెలిపారు.