అనాధ వృద్ధుడికి అభి ట్రస్ట్ అంతిమ సంస్కారాలు

ఎర్రగుంట్ల మండలం తిప్పలూరులోని ఎద్దుల పెద్ద శేషమ్మ వృద్ధాశ్రమంలో నంద్యాలకు చెందిన చెమికల్ సుబ్బరెడ్డి (60) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న అభి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎన్. విజయ బాబు ఆధ్వర్యంలో వృద్ధుడికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. అనాధలకు అంతిమ సంస్కారాలు చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ఎవరూ లేనివారికి తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా విజయ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్